samantha: చీరకట్టులో అలరించిన సమంత.. ఫొటోలు ఇవిగో!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-af7323e035402c534573279f1a1d48989438c44a.jpg)
- విశాల్ సరసన ‘ఇరుంబు తిరై’ అనే సినిమాలో నటిస్తోన్న సమంత
- చీరకట్టులో సిగ్గులొలుకుతూ ఫొటోలు
- ఫిదా అయిపోతోన్న అభిమానులు
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే చెన్నై బ్యూటీ సమంత తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అలరిస్తుంటుంది. రకరకాల స్టైల్స్‌తో, డ్రెస్‌లతో ఫొటోలు, సెల్ఫీలు దిగి ఆమె చేసే పోస్టులకు అభిమానులు మంత్రముగ్ధులవుతారు. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇందులో సమంత చీరకట్టుతో అలరించింది.
ప్రస్తుతం సమంత.. విశాల్ సరసన ‘ఇరుంబు తిరై’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్‌తో రానుంది. ఈ సినిమాలో సమంత ఇలాగే కనిపించనున్నట్లు తెలుస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సమంత కొత్త ఫొటోలను మీరూ చూడండి...
![](https://img.ap7am.com/froala-uploads/froala-690dbec1b75f5ec0c1417c77b7f476af2e06cba7.jpg)