rajanikanth: జనవరిలోనే 'భాగమతి' .. '2.0' సమ్మర్ కి వెళ్లినట్టే!

  • అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి'
  • జనవరి 26వ తేదీన విడుదల 
  • జనవరి 25న '2.0' లేనట్టే 
  • ఇది దాదాపు సమ్మర్ కి వెళ్లినట్టే

అనుష్క ప్రధాన పాత్రగా దర్శకుడు అశోక్ 'భాగమతి' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, సంక్రాంతికి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇక జనవరి 25న '2.0' సినిమా విడుదల కానుంది. అందువలన ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి.

 కానీ జనవరి 26నే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఈ సినిమా టీమ్ తాజాగా ప్రకటించింది. '2.0'కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడం వలన, ఆ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి. తాజాగా 'భాగమతి' రిలీజ్ డేట్ ఖరారు కావడంతో, జనవరిలో '2.0' రానట్టేనని అంటున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కే వస్తుందని చెబుతున్నారు.

'భాగమతి' నిర్మాతలకి తమిళ చిత్రపరిశ్రమతోను మంచి సంబంధాలు వున్నాయి. అందువలన అన్ని విషయాలను తెలుసుకునే వాళ్లు 'భాగమతి' రిలీజ్ డేట్ ప్రకటించి వుంటారు గనుక .. '2.0' రిలీజ్ వాయిదా పడిందనేది స్పష్టమైపోయింది. 

rajanikanth
akshay kumar
  • Loading...

More Telugu News