voice call: ఇక వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కి మారడం చాలా సులువు... కొత్త అప్‌డేట్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
- వాయిస్ కాల్ మాట్లాడుతూ వీడియో కాల్‌కి మారే అవకాశం
- అంతేకాకుండా వీడియో మ్యూట్ చేసే సదుపాయం కూడా
- గ్రూప్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు
ఫేస్‌బుక్ వారి మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం వారానికో అప్‌డేట్ ఇస్తూ, కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో మరో సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాయిస్ కాల్ మాట్లాడుతున్నపుడు వీడియో కాల్ చేయాల్సి వస్తే, వాయిస్ కాల్ కట్ చేసి కొత్తగా వీడియో కాల్ చేయాలి. ఇక ఆ అవసరం లేకుండా వాయిస్ కాల్ మాట్లాడుతుండగానే వీడియో కాల్‌కి స్విచ్ అయ్యేలా ఓ బటన్‌ని వాట్సాప్ తీసుకురాబోతోంది.
త్వరలో రానున్న అప్‌డేట్ ద్వారా ఈ ఆప్షన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా వాట్సాప్ వీడియోను మ్యూట్ చేయడానికి కూడా ఒక డైరెక్ట్ బటన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే అప్‌డేట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు వాట్సాప్ తన బ్లాగ్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.