TRS: అమ‌రావ‌తికి వెళ్లి చంద్ర‌బాబుకు శుభ‌లేఖ‌ అందించిన టీఆర్ఎస్ ఎంపీ!

  • అమరావతికి వెళ్లిన మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు
  • త్వ‌ర‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడి పెళ్లి
  • చంద్ర‌బాబుతో కాసేపు మాట్లాడిన టీఆర్ఎస్ నేత‌

టీఆర్ఎస్ నేత‌, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్‌రెడ్డి ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య రాజ‌ధాని అమరావతికి వెళ్లారు. అక్క‌డ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క‌లిసి కాసేపు మాట్లాడారు. తన కుమారుడి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించి, శుభలేఖ అందించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడి వివాహం త్వ‌ర‌లోనే జ‌రగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

TRS
mp
mithun reddy
Chandrababu
  • Loading...

More Telugu News