delhi dare devils: ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ సార‌థి రికీ పాంటింగ్‌?

  • గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ కోచ్‌గా ప‌నిచేసిన రికీ
  • 2015లో విజ‌యం సాధించిన ముంబై ఇండియ‌న్స్‌
  • పాంటింగ్‌ని క‌లిసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ కోసం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్ష‌కుడిగా వ్య‌వ‌హరించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే 2018 సీజ‌న్ కోసం రికీ పాంటింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఒప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు నుంచి రికీ పాంటింగ్‌కు కోచ్‌గా ఉండాల‌నే అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి రికీ కోచ్‌గా ప‌నిచేశారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో 2015 ఐపీఎల్ క‌ప్‌ను ముంబై ఇండియ‌న్స్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. మరోవైపు దిల్లీ డేర్‌డెవిల్స్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్‌ టీఏ శేఖర్‌ ముంబయి ఇండియన్స్ జ‌ట్టులో చేరుతున్న‌ట్లు తెలుస్తోంది. చాలామందితో తాము చర్చలు జరుపుతున్నట్టు దిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దవా తెలిపారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటార్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జట్టును వీడిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News