maddineni ramesh: నీ బూతులకు బాధలేదుగానీ... ఇలాంటోళ్లను చంద్రబాబు ఎంచుకున్నాడే అని జాలి..!: మద్దినేనిపై వర్మ ఎటాక్

  • అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంది
  • ఫేస్ బుక్ లో కొత్త పోస్టు పెట్టిన వర్మ
  • అన్నం గురించి ఒక్క మెతుకు చాలు
  • మద్దినేనే ఆ మెతుకైతే, కమిటీ మొత్తం అన్నం: వర్మ

"ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది. అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను" అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో కొత్త పోస్టు పెడుతూ, నంది అవార్డుల జ్యూరీ సభ్యుడు, దర్శకుడు మద్దినేని రమేష్ బాబుపై ఎటాక్ చేశాడు.

వర్మను రాయలేని రీతిలో బూతులు తిడుతూ, మద్దినేని పెట్టిన ఫేస్ బుక్ పోస్టును యథాతథంగా పోస్టు చేస్తూ తన అభిప్రాయాలను కుండబద్ద లు కొట్టాడు. తనను తిట్టినందుకు బాధ లేదని, అయితే, ఇలాంటి వ్యక్తులను అవార్డు కమిటీలో చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసినందుకు మాత్రం బాధగా ఉందని అన్నాడు.

"ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్థితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి" అని అన్నాడు.

maddineni ramesh
varma
nandi awards
  • Error fetching data: Network response was not ok

More Telugu News