meteor shower: ఆకాశం నుంచి మండుతూ పడిపోతున్న ఉల్క.... వీడియో చూడండి
- జర్మనీలో కనిపించిన దృశ్యం
- టారిడ్ ఉల్కాపాతానికి చెందినదై ఉండొచ్చన్న శాస్త్రవేత్తలు
- ఆశ్చర్యపోయిన జర్మన్, ఇటలీ, స్విట్జర్లాండ్ ప్రజలు
ఈ వారం ప్రారంభంలో ఆకాశంలో మండుతూ కిందకి పడిపోతున్న ఓ ఉల్కను చూసిన జర్మనీ ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాgతాల ప్రజలకు కూడా ఈ ఉల్క కనిపించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఉల్క కిందకి పడుతున్న దృశ్యంతో కూడిన వీడియోను హోచిన్ సిటీకి చెందిన అగ్నిమాపక శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులు మారుతూ కిందకి పడిపోతున్న ఉల్కను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఉల్క పడటాన్ని యూరప్ ఖండవ్యాప్తంగా దాదాపు 1150 మంది చూసి ఉంటారని ఇంటర్నేషనల్ మీటియర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇది విశ్వాంతరాళంలో ఇటీవల ప్రారంభమైన టారిడ్ ఉల్కాపాతానికి చెందినదై ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే ఇది ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అయి ఉంటుందని కొన్ని దేశాల ప్రజలు అనుకున్నట్లు సమాచారం. ఇది ఏంటనే విషయంపై పూర్తి స్పష్టత లేదని, ఒకవేళ ఇది ఉల్క అయి ఉంటే ఎక్కడో పడి ఉండడం గానీ లేదా ఆకాశంలో మండిపోయి ఉండటం గానీ జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.