chandrababu: తక్కువ సమయంలోనే అద్భుతంగా కట్టారు: చంద్రబాబుకు సింగపూర్ మంత్రి కితాబు

  • అమరావతికి విచ్చేసిన ఈశ్వరన్
  • సచివాలయం, అసెంబ్లీని చూపించిన చంద్రబాబు
  • సింగపూర్ ప్రాజెక్టులపై చర్చ

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ ఉదయం ఏపీ రాజధాని అమరావతికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కు చంద్రబాబు స్వాగతం పలికారు. కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీని ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన అసెంబ్లీని నిర్మించారని కితాబిచ్చారు.

అనంతరం వీరిద్దరూ సచివాలయానికి చేరుకున్నారు. అమరావతిలో సింగపూర్ సంస్థలు చేపట్టబోయే ప్రాజెక్టులపై వీరిద్దరూ చర్చించారు. అమరావతిలో నిర్మించబోతున్న శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలపై కూడా వీరు చర్చ జరిపారు.

chandrababu
ap cm
singapore
singapore minister eswaran
  • Loading...

More Telugu News