gunashekar: దర్శకుడు గుణశేఖర్ కు మద్దతు... ఆయన ప్రశ్నకు సమాధానం ఎక్కడంటున్న ఐవైఆర్ కృష్ణారావు!

  • అవార్డుల్లో 'రుద్రమదేవి'కి అన్యాయం జరిగిందన్న గుణశేఖర్ 
  • ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న కృష్ణారావు
  • తన ప్రశ్నలకూ సమాధానం చెప్పలేదని ఏపీ సర్కారుపై విసుర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో, తాను నిర్మించిన 'రుద్రమదేవి'కి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, దర్శకుడు గుణశేఖర్ అవార్డుల కమిటీ ముందు కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆయనకు అనూహ్యంగా ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు మద్దతు పలికారు.

గుణశేఖర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తాను కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగానని, అప్పట్లో తన ప్రశ్నలు నచ్చక ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదని కృష్ణారావు విమర్శించారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కృష్ణారావు కొన్ని పోస్ట్‌ లు పెట్టి, ఇతరులు పెట్టిన ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు షేర్ చేయడంతో ఆయనను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

gunashekar
rudramadevi
nandi awards
iyr krishnarao
  • Loading...

More Telugu News