padmavathi: సంజయ్ లీలా భన్సాలీ తల నరికేస్తాం : రాజ్ పుత్ కర్ణిసేన

  • దీపికా పదుకునే తలకు 5 కోట్లు వెల కట్టిన రాజ్ పుత్ కర్ణి సేన
  • ముక్కు, చెవులు కోస్తామని హెచ్చరిక
  • సినిమా విడుదల ఆపకుంటే సంజయ్ లీలా భన్సాలీ తల నరుకుతామని వార్నింగ్

బాలీవుడ్ లో అద్భుత దృశ్యసృష్టికర్తగా పేరొందిన సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత వివాదాస్పద సినిమాగా నిలుస్తోంది. తమ జాతికి ప్రతీకగా భావించే రాణి పద్మావతిని ఇందులో అభ్యంతరకరంగా చిత్రీకరించారని రాజ్ పుత్ కర్ణి సేన ఈ చిత్ర నిర్మాతపై మొదటి నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు సందర్భాల్లో షూటింగ్ ను అడ్డుకున్నారు కూడా.

ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతకు వార్నింగులు మరింత ఎక్కువయ్యాయి. భన్సాలీ తల నరికేస్తామని రాజ్ పుత్ కర్ణి సేన హెచ్చరించింది. సినిమా విడుదలను తక్షణం నిలిపేయాలని సూచించారు. కాగా, దీపికా పదుకునే తల నరికితే 5 కోట్లు ఇస్తామని ఇప్పటికే ఈ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె ముక్కు, చెవులు కోస్తామని కూడా హెచ్చరించారు.

padmavathi
sunjauy leela bhansali
deepika padukone
rajput karni sena
  • Loading...

More Telugu News