Nehru: నెహ్రూను స్త్రీలోలుడిగా చూపే ప్రయత్నం.. తప్పులో కాలేసిన బీజేపీ!

  • కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనుకుని బొక్కబోర్లా పడిన అమిత్ 
  • సోదరిని ఆత్మీయంగా హత్తుకున్న నెహ్రూ ఫొటోలు పోస్ట్
  • మాలవీయపై మండిపడుతున్న నెటిజన్లు

కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన బీజేపీ జాతీయ విభాగం ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ తానే ఇబ్బందుల్లో పడ్డారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను స్త్రీలోలుడిగా చూపే ప్రయత్నంలో తప్పు చేసి నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘‘హార్ధిక్‌కు నెహ్రూ డీఎన్ఏ ఎక్కువైనట్టు కనిపిస్తోంది’’ అంటూ కామెంట్ తో పాటు తొమ్మిది ఫొటోలను మాలవీయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అయితే ఆయన పోస్ట్ చేసిన 9 ఫొటోల్లో రెండింటిలో నెహ్రూను హత్తుకున్నది ఆయన సోదరి విజయలక్ష్మి కాగా, మిగతావి కూడా అంత అభ్యంతరకరంగా లేవు. ఈ ఫొటోలపై స్పందించిన నెటిజన్లు అమిత్ మాలవీయపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన అజ్ఞానాన్ని, నీచబుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఇటువంటి పోస్టులు పెట్టేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దని అమిత్‌కు కొందరు సలహా కూడా ఇస్తున్నారు.

Nehru
Congress
BJP
Amit Malviya
  • Loading...

More Telugu News