pok: పీవోకేను భారత్ చేజిక్కించుకోవాలంటే ఎవరూ ఆపలేరు: కేంద్ర మంత్రి
- పీవోకే భారత్ లో అంతర్భాగం
- దానిపై సర్వహక్కులూ భారత్ వే
- గత ప్రభుత్వాల తప్పిదం వల్లే పాక్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించగలిగింది
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ను అణుసామర్థ్యం గల పాకిస్థాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ మాట్లాడుతూ, పీవోకేను భారత్ చేజిక్కించుకోవాలంటే ఎవరూ ఆపలేరని అన్నారు. పీవోకే భారత్ అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. దానిపై సర్వహక్కులు భారత్ వేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే కశ్మీర్ లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించ గలిగిందని ఆయన తెలిపారు. ఆ భాగాన్ని పాక్ నుంచి విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని ఆయన ప్రకటించారు.