maganti babu: ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆతిథ్యం ఇవ్వ‌డానికి పోటీప‌డ్డ మాగంటి బాబు, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌!

  • ప్రజాప్రతినిధులకు చింత‌మనేని ప్ర‌భాక‌ర్ అల్పాహార విందు
  • కొయ్యలగూడెం వద్ద భోజనం ఏర్పాటు చేసిన మాగంటి బాబు
  • పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించిన ప్ర‌జాప్ర‌తినిధులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రజా ప్రతినిధులు ఈ రోజు నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై అధ్యయన యాత్ర చేశారు. విజయవాడ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో బ‌య‌లుదేరి వెళ్లారు. ప్ర‌జాప్ర‌తినిధులంతా బ‌స్సుల్లో పశ్చిమగోదావరి జిల్లాలోకి రాగానే ఏపీ ప్ర‌భుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్ వారికి స్వాగ‌తం ప‌లికారు. అలాగే దుగ్గిరాలలో ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

అయితే, మ‌రోవైపు టీడీపీ ఎంపీ మాగంటి బాబు కొయ్యలగూడెం వద్ద వీరికి భోజనం ఏర్పాటు చేశారు. ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డుతున్న‌ట్లు ప్ర‌జా ప్రతినిధుల‌కి విందు ఇవ్వ‌డానికి ఆసక్తి చూపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ర‌క‌ర‌కాల వంట‌లు సిద్ధం చేశారు. అనంత‌రం అక్క‌డి నుంచి వెళ్లిన ప్ర‌జా ప్ర‌తినిధులు పట్టిసీమ ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ‌ పంట కంకులతో రైతులు వారికి స్వాగ‌తం ప‌లికారు. గోదావరి నుంచి పంపులద్వారా నీటిని విడుద‌ల చేసే అంశాన్ని గురించి ప్ర‌జా ప్ర‌తినిధులు అడిగి తెలుసుకున్నారు.

పట్టిసీమ చూసిన త‌రువాత వారంతా పోలవరం చేరుకున్నారు. అక్క‌డి ప‌నులను ప‌రిశీలించారు. అనంత‌రం అక్కడి నుంచి విశాఖపట్నంలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు బ‌య‌లుదేరారు. ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌ర‌దాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు తీసుకుంటూ గ‌డిపారు.

 

       

maganti babu
chintamaneni prabhakar
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News