ivanka trumph: ఎయిర్ పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఇవాంకా ట్రంప్ ప్రయాణం

  • ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనున్న ఇవాంకా ట్రంప్
  • ఓఆర్ఆర్ ద్వారా హైటెక్స్ 
  • ఫలక్ నుమా ప్యాలెస్ కు రోడ్డు మార్గంలో ప్రయాణం
  • చార్మినార్, లాడ్ బజార్ లలో షాపింగ్ చేసే అవకాశం

అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత సలహాదారు, ఆయన తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాదు పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇవాంకా ట్రంప్ ప్రత్యేక విమానంలో ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మీదుగా ఆమె హైటెక్స్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆమె రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు.

అక్కడ రాత్రి బస చేసి మరుసటి రోజు సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం ఆమె ఛార్మినార్, లాడ్ బజార్ లలో షాపింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శంషాబాద్, హైటెక్స్, ఫలక్ నుమా ప్యాలెస్ లను అమెరికా భద్రతాధికారులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. 

ivanka trumph
hyderabad tour
ivanka tour
  • Loading...

More Telugu News