nathuram godse: నాథూరాం గాడ్సేకు గుడి కడుతున్న హిందూ మహాసభ!
- కార్యాలయంలో విగ్రహావిష్కరణ, పూజలు
- ఆరోపించిన ప్రతిపక్షాలు
- సీఎం శివరాజ్ సింగ్‌పై ఆరోపణలు చేసిన అజయ్ సింగ్
అఖిల భారతీయ హిందూ సభ గ్వాలియర్‌లోని తమ కార్యాలయంలో మహాత్మగాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టించింది. అలాగే దౌలత్‌గంజ్‌లో గాడ్సేకు గుడి కట్టడానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ గుడి నిర్మాణం కోసం భూమి కేటాయించాలని హిందూ మహాసభ గ్వాలియర్ జిల్లా యంత్రాగాన్ని కోరింది. వారి వినతిని జిల్లా యంత్రాంగం తిరస్కరించింది.
గాంధీని చంపడానికి ఒక వారం ముందు గాడ్సే, గ్వాలియర్‌లోని హిందూ మహాసభ కార్యాలయంలో ఉన్నారని, అందుకే ఆ కార్యాలయాన్ని కర్మస్థలిగా భావించి విగ్రహావిష్కరణ చేసినట్లు హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైకి మాత్రమే గాంధీ పేరు చెబుతున్నారని, లోపల గాడ్సేని ప్రేమిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో మీరట్‌లోనూ గాడ్సే విగ్రహాన్ని హిందూ మహసభ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.