har har mahadev: అశ్లీల సైట్లు ఓపెన్ చేస్తే భ‌క్తి గీతాలు వినిపించే వెబ్ యాప్‌!

  • రూపొందించిన బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ అధ్యాప‌కుడు
  • వెబ్ అప్లికేష‌న్ పేరు 'హ‌ర హ‌ర మ‌హాదేవ‌'
  • అశ్లీల‌త‌ను పిల్ల‌ల‌కు దూరంగా ఉంచే ప్ర‌య‌త్న‌మ‌న్న డాక్ట‌ర్ విజ‌య‌నాథ్‌

ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చాక అశ్లీల‌త‌, అస‌భ్య‌త‌, ర‌క్త‌పాతం ఒక్క క్లిక్ దూరంలో ఉన్నాయి. వీటి నుంచి పిల్ల‌ల‌ను కాపాడ‌టానికి త‌ల్లిదండ్రులు చేయ‌ని ప‌ని లేదు. అశ్లీల వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేయ‌డానికి విదేశీయులు త‌యారు చేసిన వెబ్ అప్లికేష‌న్లు ఇన్‌స్టాల్ చేద్దామంటే మాల్‌వేర్ భ‌యం. దీంతో వారు ఏం చేయలేక పోతున్నారు. వారి స‌మ‌స్య‌ను దేశీ రీతిలో ప‌రిష్క‌రించ‌డానికి బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ విజ‌య‌నాథ్ ఓ వెబ్ అప్లికేష‌న్ రూపొందించాడు. దాని పేరు 'హ‌ర హ‌ర మ‌హ‌దేవ‌'

ఇది అశ్లీల సైట్ల‌ను ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌పుడు వాటిని బ్లాక్ చేయ‌డ‌మే కాకుండా కొన్ని భ‌క్తిగీతాల‌ను ప్లే చేస్తుంది. అందుకు ఈ అప్లికేష‌న్‌కి ఆ పేరు పెట్టిన‌ట్లు విజ‌య‌నాథ్ తెలిపారు. ప్ర‌స్తుతం హిందూ భ‌క్తిపాట‌ల‌ను మాత్ర‌మే ఈ యాప్ ప్లే చేస్తోంద‌ని, త్వ‌ర‌లో ఇత‌ర మ‌తాల గీతాల‌ను కూడా పొందుప‌రిచి యాప్‌ను అభివృద్ధి చేస్తామ‌ని విజ‌యనాథ్ వెల్ల‌డించాడు. ముఖ్యంగా పిల్ల‌ల‌ను అశ్లీల‌త‌కు దూరంగా ఉంచే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ వెబ్ యాప్‌ను రూపొందించిన‌ట్లు విజ‌య‌నాథ్ చెప్పాడు. harharmahadev.co వెబ్‌సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News