bandla ganesh: పవన్ కి నా సాయం అవసరమే లేదు . అదంతా పుకారే!:బండ్ల గణేశ్

  • పవన్ కి నేను సాయం చేయవలసిన అవసరం లేదు 
  • పనిలేని వాళ్లు ఇలాంటివి పుట్టిస్తుంటారు 
  • నేను ఎవరి మధ్య ఫిట్టింగులు పెట్టలేదు 
  • ఆ ఆర్టిస్ట్ ను చూస్తే జాలేసింది  

"పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలకి సంబంధించిన సమస్యలను మీరు దగ్గరుండి పరిష్కరించారనే టాక్ వుంది .. దీనిపై మీరు ఏమంటారు?" అనే ప్రశ్న .. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ కి ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.

"పవన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయనకి ఆయనే సాయం చేసుకుంటాడు .. నేను సాయం చేయవలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పనీపాటా లేనివాళ్లు కొంతమంది వుంటారు. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ .. ఇప్పటికి కూడా వేషాల కోసం బతిమాలుకునే స్థాయిలోనే వాళ్లుంటారు. హీరోల పక్కన కూర్చుని .. వాళ్లతో కలిసి భోజనం చేస్తూ తనకి ఆయన మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వుంటారు. అలాంటివాళ్ల మాటలను పట్టించుకోవద్దు సార్" అన్నారు.

"ఇక కొంతమంది ఆర్టిస్టులకు .. హీరోలకు మధ్య తాను ఫిట్టింగ్ పెడతాననే కామెంట్ పై కూడా ఆయన స్పందించారు."మీ ప్రోగ్రామ్ లో ఒక ఆర్టిస్ట్ ఈ విషయం చెబుతూ ఉంటే నేను చూశాను. 40 యేళ్లుగా ఇండస్ట్రీలో కొట్టుకులాడుతున్నారు గదా, వేషాలు లేకపోతే వాళ్లకి పని జరగదు. ఆ ఆర్టిస్ట్ మీద కోపం రాలేదు .. ఎప్పటికి ఎదుగుతాడా అని జాలేసింది" అని చెప్పుకొచ్చారు.     

bandla ganesh
pavan kalyan
  • Loading...

More Telugu News