bandla ganesh: ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే పవన్ ఎవరినైనా ప్రేమిస్తారు!: బండ్ల గణేశ్

  • నిర్మాతగా నాకు పవన్ జన్మనిచ్చాడు 
  • ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ప్రేమిస్తాడు 
  • కష్టపడే తత్వాన్ని బట్టి అవకాశం ఇస్తాడు 
  • అలా నాకు ఆయన ఓ అవకాశం ఇచ్చాడు

తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఎంతో మంది హీరోలు ఉండగా పవన్ కల్యాణ్ అంటే మీకు ఎందుకంత పిచ్చి? కేవలం ఒక సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడనేనా? .. లేకపోతే వేరే కారణాలేమైనా ఉన్నాయా?" అనే ప్రశ్న గణేశ్ కి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " పెదనాన్నలు .. బాబాయ్ లు .. ఉండగా తండ్రి అంటేనే ప్రత్యేకమైన అభిమానం ఎందుకు ఉంటుంది? .. జన్మనిచ్చాడు కాబట్టి. అలాగే నిర్మాతగా నాకు పవన్ జన్మనిచ్చాడు. నాన్న మీద ప్రేమ ఉన్నంత మాత్రాన పెదనాన్నలు .. బాబాయ్ ల మీద ప్రేమ లేదని అర్థం కాదు. అలా మిగతా హీరోలన్నా నాకు అభిమానమే. పవన్ ఓ అతీతమైన శక్తి .. అవతలవాళ్ల హోదాను బట్టి ఆయన గౌరవించడు. ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఆయనలో నాకు నచ్చేది అదే. ఎదుటివాళ్లలో కనిపించే కష్టపడే తత్వాన్ని చూసి అవకాశం ఇస్తాడు .. అలా నాకు ఆయన ఓ అవకాశం ఇచ్చాడు" అని చెప్పుకొచ్చారు.   

bandla ganesh
pavan kalyan
  • Loading...

More Telugu News