Pullela Gopichand: 2018లో ప‌ట్టాలెక్క‌నున్న బ్యాడ్మింట‌న్ కోచ్‌ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌

  • హిందీ, తెలుగు భాష‌ల్లో సినిమా
  • ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌ నిర్మాణం 
  • వెల్ల‌డించిన ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌

పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్ వంటి మేటి బ్యాడ్మింట‌న్ స్టార్ల‌ను త‌యారు చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా త్వ‌రలో సినిమా తీసేందుకు సన్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. 2018లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అబుందాంటియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు.

ఈ సినిమాను హిందీ, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోందని త‌ర‌ణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌న క‌థ ద్వారా చాలా మంది యువ‌త క‌ల‌లు నెర‌వేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిసి గర్వపడుతున్నట్లు గోపీచంద్ తెలిపారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ జీవిత క‌థ కోసం శ్ర‌ద్ధా క‌పూర్‌కు పుల్లెల గోపీచంద్ శిక్ష‌ణ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Pullela Gopichand
badminton
Saina Nehwal
biopic
sports
taran adarsh
fox star studios
  • Loading...

More Telugu News