jhansi: భర్త పాడిన పాటకు కరిగిపోయిన భార్య.. అతని గుండెలకు హత్తుకున్న వైనం... ఢిల్లీ పోలీసులు షేర్ చేసుకున్న వీడియో!

  • మనస్పర్థలతో కేసులు పెట్టుకున్న జంట
  • కౌన్సెలింగ్ వేళ, అనూహ్యంగా మారిన పరిస్థితి
  • పాట పాడి భార్యను ఐస్ చేసిన భర్త
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

వారిద్దరూ భార్యా భర్తలు. మనస్పర్థలతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ కు పిలిచిన వేళ, ఎవరూ ఊహించని విధంగా తనను తిరిగి చేరుకోవాలని కోరుతూ సదరు భర్త బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'నా సీఖా జీనా తేరా బినా హమ్ దమ్' అంటూ 'బద్లాపూర్' చిత్రంలోని పాటందుకోగా, అతని భార్య ఐస్ లా కరిగిపోయింది. భర్త గుండెలపై వాలిపోయింది. వీరిద్దరూ తిరిగి కలిసిన తరువాత పోలీసులు మిఠాయిలు పంచారు.

ఝాన్సీ పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరుగగా, ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మధుర్ వర్మ దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో 'లవ్ ట్రియంప్స్' అనే క్యాప్షన్ పెట్టి, మూడు రోజుల క్రితం షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

jhansi
couple
Husband sings for wife
madhur varma
  • Error fetching data: Network response was not ok

More Telugu News