India: ఇంకా మొదలు కాని ఇండియా - శ్రీలంక క్రికెట్ మ్యాచ్!

  • కోల్ కతాలో కురుస్తున్న మంచు
  • 9 గంటలకే ప్రారంభం కావాల్సిన మ్యాచ్
  • టాస్ ఆలస్యం.. ప్రేక్షకుల స్పందన కరవు

ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ వాతావరణం అనుకూలించని కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో దట్టంగా మంచు కురుస్తుండటంతో టాస్ కూడా ఇంకా పడలేదు. ఉదయం 9.30 గంటల వరకూ సూర్యుడు కూడా కనిపించలేదు.

కాగా, ఈ మ్యాచ్ కి క్రికెట్ అభిమానుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం. అందుబాటులో ఉంచిన టికెట్లలో 20 శాతం కూడా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. మంచు పూర్తిగా ఆరిన తరువాతనే టాస్ వేసి, మ్యాచ్ ని ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. పిచ్ పై ఉన్న మంచు కారణంగా తొలి సెషన్ లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండవచ్చని అంచనా. భారత గడ్డపై ఇప్పటివరకూ శ్రీలంక ఒక్క టెస్టు మ్యాచ్ ని కూడా గెలవలేదన్న సంగతి తెలిసిందే. 2009 తరువాత తొలిసారిగా ఆ జట్టు ఇండియాలో రెడ్ బాల్ తో మ్యాచ్ ఆడనుంది.

India
Sri Lanka
Cricket
eden gardens
  • Loading...

More Telugu News