Ashish Nehra: నేటి నుంచి కొత్త అవతారంలో ఆశిష్ నెహ్రా.. కామెంట్రీ బాక్సులో కనిపించనున్న మాజీ పేసర్!

  • నేటి నుంచి కామెంటరీ బాక్స్‌లో కనిపించనున్న నెహ్రా
  • విషయాన్ని వెల్లడించిన చిన్ననాటి మిత్రుడు సెహ్వాగ్ 
  • ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఢిల్లీ పేసర్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్ అయిన లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా నేటి నుంచి సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. భారత్-శ్రీలంక మధ్య నేటి నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు నెహ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో ఈ ఉదయం 9.30 గంటలకు తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

నెహ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న విషయాన్ని ఆయన చిన్ననాటి స్నేహితుడు, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నెహ్రా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన విషయం విదితమే.

Ashish Nehra
Cricket
commentary
  • Loading...

More Telugu News