manish sisodia: తెలంగాణ శాసనసభలో ఢిల్లీ డిప్యూటీ సీఎం!

  • అసెంబ్లీని సందర్శించిన మనీష్ శిసోడియా
  • స్వాగతం పలికిన కేటీఆర్
  • టీహబ్ పై ప్రశంసలు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి కేటీఆర్ సహా ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో కేటీఆర్ తో శిసోడియా భేటీ అయ్యారు. తెలంగాణలో చేపట్టిన టీహబ్ చాలా బాగుందని ఈ సందర్భంగా మనీష్ చెప్పారు. ఢిల్లీలో కూడా టీహబ్ ను ఏర్పాటు చేస్తే, తాము కూడా కలిసి పని చేస్తామని తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని కితాబిచ్చారు. హైదరాబాద్ లో వాతావరణం బాగుందని... ఢిల్లీ కాలుష్యంతో నిండిపోయిందని... పైకి చూస్తే ఆకాశమే కనిపించదని అన్నారు. కాసేపట్లో టీహబ్ ను మనీష్ సందర్శించనున్నారు.

manish sisodia
KTR
telangana assembly
thub
  • Loading...

More Telugu News