radio jockey: రేడియో జాకీ అవ‌తార‌మెత్తిన క‌ర‌ణ్ జొహార్‌

  • కాలింగ్ క‌ర‌ణ్ పేరుతో రేడియో షో
  • త‌న మొద‌టి రేడియో షో అని ట్వీటిన ఫిల్మ్ మేక‌ర్‌
  • రిలేష‌న్‌షిప్ స‌ల‌హాలు ఇవ్వ‌నున్న నిర్మాత‌

టీవీ కార్య‌క్ర‌మాలు, అవార్డు కార్య‌క్ర‌మాలు, సినిమాలతో పాటు ఇప్పుడు కొత్త‌గా రేడియో రంగంలోకి నిర్మాత‌, ఫిల్మ్‌మేక‌ర్ క‌ర‌ణ్ జొహార్ అడుగుపెట్టాడు. కాలింగ్ క‌ర‌ణ్ పేరుతో ముంబైలోని ఇష్క్ 104.8 ఎఫ్ఎం ఛాన‌ల్లో రేడియో జాకీగా క‌ర‌ణ్ జొహార్ అవ‌తారం ఎత్తాడు.

రేడియోలో మీ కొత్త బెస్ట్ ఫ్రెండ్‌ని అంటూ ఈ విష‌యం గురించి ట్వీట్ కూడా చేశాడు. రిలేష‌న్‌షిప్‌లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌న‌తో పంచుకోవాల‌ని క‌ర‌ణ్ కోరాడు. వారంలో ఐదు రోజులు, రోజుకి మూడు సార్లు ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న క‌ర‌ణ్, రేడియో జాకీగా ఎలా అల‌రించ‌నున్నాడో చూడాలి మ‌రి!

radio jockey
karan johar
ishq fm
relationship guru
advice
mumbai
coffee with karan
  • Loading...

More Telugu News