mr bean: 62 ఏళ్ల వయసులో తండ్రి అవుతున్న 'మిస్టర్ బీన్'

  • 33 ఏళ్ల లూయిస్ తో సహజీవనం
  • నార్త్ లండన్ మాల్ లో గర్భవతిగా కనిపించిన లూయిస్
  • మిస్టర్ బీన్ కి ఇప్పటికే కొడుకు, కుమార్తె ఉన్నారు

'మిస్టర్ బీన్' సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్. ఆయన త్వరలోనే మూడోసారి తండ్రికాబోతున్నాడు. ప్రస్తుతం అట్కీన్సన్ వయసు 62 ఏళ్లు. 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో మిస్టర్ బీన్ సహజీవనం చేస్తున్నాడు. ఆదివారంనాడు నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడంతో... ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. అయితే, దీనికి సంబంధించి వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. అట్కీసన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

mr bean
rowan atkinson
louse ford
  • Loading...

More Telugu News