Pawan Kalyan: బాబాయి పవన్ కల్యాణ్ కోసం అబ్బాయి రాంచరణ్ త్యాగం!

  • సంక్రాంతికి విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'
  • అదే సమయానికి 'రంగస్థలం' కూడా రెడీ
  • రెండు మెగా చిత్రాలు ఒకేసారి ఎందుకని భావించిన రాంచరణ్
  • ఫిబ్రవరి చివరి వారానికి విడుదల వాయిదా!

సరిగ్గా సంక్రాంతి సీజన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ 'రంగస్థలం' విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 'రంగస్థలం' చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు భావించారు. ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్రమోషన్ పనులు ప్రారంభించాలని భావించారు.

ఇక అదే సమయానికి తన బాబాయ్ చిత్రం కూడా విడుదల అవుతుండటంతో, పోటీ ఎందుకని భావించి ఫిబ్రవరి చివరి వారానికి చిత్రం విడుదలను వాయిదా వేసుకోవాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడని సినీ ఇండస్ట్రీ సమాచారం. ఈ చిత్రంలో రాంచరణ్, గుబురు గడ్డంతో న్యూలుక్ లో కనిపించనున్నాడు. ఇక ఇందులో చరణ్ బధిరుడిగా కనిపిస్తాడని కూడా మరో వార్త హల్ చల్ చేస్తోంది.

కాగా, 'రంగస్థలం' షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు రావడంతో, ఫిబ్రవరి వరకూ 'సైరా' నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకోవాలని చరణ్ భావిస్తున్నాడట. ఇక బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగవని తెలుస్తుండటంతో మెగా అభిమానుల్లో కూడా ఆనందం కనిపిస్తోంది.

Pawan Kalyan
Ramcharan
rangasthalam
agnatavasi
release date
  • Loading...

More Telugu News