trivikram srinivas: క్రొయేషియాలో బిజీగా ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది.. చాలా ఆనందంగా ఉంది: త్రివిక్రమ్ శ్రీనివాస్

  • షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో వార్త తెలిసింది
  • చాలా సంతోషంగా ఉంది
  • పవన్ సినిమా షూటింగ్ కోసం క్రొయేషియాలో ఉన్న త్రివిక్రమ్

బిఎన్ రెడ్డి స్టేట్ అవార్డు (2015)కు ఎంపిక కావడం పట్ల ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను అభిమానించే దర్శకుల్లో ఒకరైన బీఎన్ రెడ్డిగారి పేరు మీద ఉన్న అవార్డును అందుకోనుండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాడు. యూరప్ లోని క్రొయేషియాలో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో తనకు ఈ అవార్డు వార్త తెలిసిందని ఆయన తెలిపాడు. ఎక్కడో దూరంగా ఉండటంతో అవార్డుల పూర్తి వివరాలు కూడా పెద్దగా తెలియలేదని చెప్పాడు. క్రొయేషియాలో షూటింగ్ పూర్తవుతోందని... రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తున్నామని తెలిపాడు. అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపాడు. 

trivikram srinivas
tollywood
bn reddy award
  • Loading...

More Telugu News