bandla ganesh: నాకు మనసు బాగోలేకపోతే త్రివిక్రమ్ తో మాట్లాడతా: బండ్ల గణేశ్

  • త్రివిక్రమ్ తో మాట్లాడితే రీ ఛార్జ్ అవుతాం  
  • నేను చేసిన 'తీన్ మార్' సినిమాకి ఆయన రచయిత 
  • నేను 'గబ్బర్ సింగ్' చేయడానికి ఆయన కూడా ఓ కారణం
  • కొన్ని నిర్ణయాల విషయంలో ఆయనను సంప్రదిస్తుంటాను   

తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బండ్ల గణేశ్, ఆ తరువాత నిర్మాతగా మారి ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. స్నేహితుల సహాయ సహకారాలతోనే తాను నిర్మాతగా నిలదొక్కుకున్నానన్నారు

 "ఒక్కోసారి మనసుకి బాధ .. చీకాకు అనిపించినప్పుడు వెంటనే త్రివిక్రమ్ దగ్గరికి వెళతా. నేనున్న పరిస్థితి గురించి ఆయనకి చెబుతాను. ఆయనతో ఓ గంటసేపు మాట్లాడితే చాలు .. ఎవరైనా సరే వెంటనే రీ ఛార్జ్ అవుతారు. తలపెట్టిన పనిమీద కసి పెరుగుతుంది .. మళ్లీ మన పని మనం చేసుకునేలా చేస్తాడు. నేను చేసిన 'తీన్ మార్' కి ఆయన రచయితగా పని చేశారు. ఓ నిర్మాతగా నేను 'గబ్బర్ సింగ్' చేయడానికి పవన్ కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా కారకుడే. ఆ సినిమా నా కెరియర్ నే మార్చేసింది .. అందుకే నాకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఆయనను సంప్రదిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.        

bandla ganesh
trivikram
  • Loading...

More Telugu News