south sea: 1135 కోట్లతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తున్న ఫ్రాన్స్!
- 2020 నాటికి నగర నిర్మాణం పూర్తి
- ఇందులో 300 మందికి నివాసాలు
- వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటు
ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త అద్భుత సృష్టికి రూపకల్పన చేస్తోంది. 1135 కోట్ల రూపాయలతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. ఈ నగరాన్ని ప్రపంచంలోనే భిన్నంగా నిలిపేలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
ఇక ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.