Chandrababu: శాసన మండలి, అసెంబ్లీకి కొత్త పదవులు ప్రకటించిన చంద్రబాబు

  • శాసనమండలి చైర్మన్ గా ఎండీ ఫరూక్
  • మండలి చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్
  • అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డి
  • ఐదుగురికి విప్ పదవులు.. గవర్నర్ ఆమోదానికి జాబితా

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొత్త పదవులను ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ గా ఎండీ ఫరూక్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనమండలి చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ ను, విప్ లుగా బుద్ధా వెంకన్న, షరీఫ్, రామసుబ్బారెడ్డిలను నియమించారు.

అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డిని ప్రకటించిన ఆయన, ఇద్దరికి విప్ పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను అసెంబ్లీ విప్ లుగా చంద్రబాబు ఎంచుకున్నారు. ఈ జాబితాను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఆమోదించిన తక్షణమే, వారు పదవులను స్వీకరించనున్నారు.

Chandrababu
Andhra Pradesh
assembly
chief vip
  • Loading...

More Telugu News