China: లిఫ్టులో పురుడు పోసిన ఆసుపత్రి సిబ్బంది!

  • చైనాలోని షాన్ డాంగ్ లోని ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన నిండు గర్భిణి 
  • రూంలో చేర్చేందుకు తీసుకెళ్తుండగా నొప్పులు
  • లిఫ్ట్ లోనే డెలివరీ..సోషల్ మీడియాలో వైరల్

ఆసుపత్రిలో చేరేలోపు లిఫ్టులో ఒక తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే.... చైనాలోని షాన్‌ డాంగ్‌ లో గల ఆసుపత్రిలో చేరేందుకు నిండు గర్భిణి వచ్చింది. దీంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది ఆమెను రూంలో చేర్చేందుకు లిఫ్టులో తీసుకెళ్తున్నారు. అంతలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి.

దీంతో లిఫ్ట్ లోని ఇతరులను బయటకు పంపిన ఆసుపత్రి సిబ్బంది, లిఫ్ట్ లోనే ఆమెకు పురుడుపోశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని ఆసుపత్రిలోని రూంలో చేర్చారు. తల్లీ‌బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. 

China
delivery
mother gives birth
lift
  • Error fetching data: Network response was not ok

More Telugu News