dawood ibrahim: 1993ను మించిన దాడులు చేస్తాం... డాన్ ఆగ్రహంగా ఉన్నాడు!: మీడియాకు ఫోన్ చేసిన దావూద్ అనుచరుడు

  • వేలంలో 11.58 కోట్ల రూపాయలు పలికిన దావూద్ ఆస్తులు
  • కరాచీ నుంచి మీడియా ప్రతినిధికి ఫోన్ చేసిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు
  • వేలం వేసిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు జరపనివ్వమని హెచ్చరికలు

ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో ఆయన ఆస్తులకు సంబంధించి 'ఢిల్లీ జైకా' (రానక్‌ అఫ్రోజ్‌) అనే హోటల్‌ 4.53 కోట్ల రూపాయలు పలకగా, షబ్నామ్‌ గెస్ట్‌ హౌస్‌ 3.52 కోట్ల రూపాయలు, దామర్వాలా భవంతిలోని ఆరు గదులు 3.53 కోట్ల రూపాయలు పలికాయి. ఈ ఆస్తులపై మొత్తంగా 11.58 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ ఆస్తులను సైఫీ బుర్హానీ అప్ లిఫ్ట్ మెంట్ ట్రస్ట్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కి ఫోన్ చేసి, తనను తాను దావూద్ అనుచరుడిగా పరిచయం చేసుకున్న ఉస్మాన్ చౌదరి మాట్లాడుతూ, వేలం వేసిన స్థలాల్లో ఏ నిర్మాణాలు కట్టనివ్వమని బెదిరించాడు. అంతే కాకుండా 1993 నాటి పేలుళ్లు మరిచిపోయారా?. అంతకంటే పెద్ద దాడి చేస్తాం.. అంటూ హెచ్చరించాడు. తన ఆస్తులు వేలం వేయడంపై దావూద్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని అతను తెలిపాడు. ఈ సంభాషణను ఆ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ కాల్ కరాచీ నుంచి వచ్చిందని తెలిపింది. 

  • Loading...

More Telugu News