Xiaomi: మళ్లీ పేలిన రెడ్‌మీ ఫోన్.. తృటిలో తప్పిన ప్రమాదం

  • కొనసాగుతున్న రెడ్‌మీ  పేలుళ్లు
  • ఈసారి గుంటూరు జిల్లా రెంటచింతలలో
  • నెల రోజుల క్రితమే ఫోన్ కొనుగోలు

చైనా మొబైల్ మేకర్ షియోమీకి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. గతంలో విశాఖపట్టణం, విజయవాడ, బెంగళూరుల్లో రెడ్‌మీ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగుచూడగా తాజాగా గుంటూరు జిల్లా రెంటచింతలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి మాన్యంలో మరో ఫోన్ పేలింది.

గ్రామానికి చెందిన కొత్తపల్లి అశోక్ అనే విద్యార్థి నెల రోజుల క్రితం రెడ్‌మీ ఫోన్ కొనుగోలు చేశాడు. రోజులాగే చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ పూర్తయిన తర్వాత తీసేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయం కాలేదని అశోక్ తెలిపాడు. ఈ ఘటనపై కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నాడు.

Xiaomi
Redme
China
Blast
Guntur
  • Loading...

More Telugu News