university: యూజీసీ షాక్... వర్సిటీ హోదా కోల్పోయిన 120 యూనివర్సిటీలు.. విట్, గీతం, ఎస్.ఆర్.ఎం. కూడా!
- దూరవిద్య విధానం ద్వారా 4 విద్యాసంస్థలు జారీ చేసిన ఇంజనీరింగ్ పట్టాలు రద్దు
- విద్యా సంస్థలు అన్నీ యథావిధిగా పనిచేయవచ్చు
- హోదా కోల్పోయిన విద్యాసంస్థల పేరు చివర వర్సిటీ అన్న పదం ఉండకూడదు
ఇంజనీరింగ్ విద్య నాణ్యత విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు పలు అంశాలను ప్రస్తావిస్తూ, యూజీసీకి పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో స్పందించిన యూజీసీ దేశ వ్యాప్తంగా దాదాపు 120 విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదాను రద్దు చేసింది.
అయితే, విద్యా సంస్థలు అన్నీ యథావిధిగా పనిచేయవచ్చు. కానీ, హోదా కోల్పోయిన విద్యాసంస్థల పేరు చివర యూనివర్సిటీ అన్న పదం ఉండకూడదు. ఆయా విద్యా సంస్థలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో పనిచేయాలి, అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అనుబంధంగా నడపాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ దూరవిద్య విధానం ద్వారా 4 విద్యాసంస్థలు జారీ చేసిన ఇంజనీరింగ్ పట్టాలు రద్దు అయ్యాయి.
వర్సీటీ హోదా కోల్పోయిన పలు విద్యా సంస్థలు..
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)
గీతం, విశాఖ పట్నం
ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్, అనంతపురం
విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ రీసెర్చ్, గుంటూరు.