airtel: ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం కొత్త ఆఫర్ ప్ర‌వేశ పెట్టిన ఎయిర్‌టెల్‌!

  • రూ. 3,999 రీఛార్జీతో ఏడాది పాటు కాల్స్ ఫ్రీ
  • 300 జీబీ డేటా, రోజుకి 100 ఎసెమ్మెస్‌లు
  • రూ. 1999, రూ. 999 రీఛార్జీలు కూడా

జియో పోటీని ఎదుర్కోవ‌డానికి టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మ‌రో అద్భుత ఆఫ‌ర్‌తో ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందుకోసం మూడు భారీ రీఛార్జీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.3,999తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు అన్ని లోక్‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 300 జీబీ డేటాతోపాటు ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపే సదుపాయం క‌ల్పించింది.

అలాగే రూ. 1999 రీఛార్జ్‌తో 180 రోజుల పాటు అన్ని లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ తోపాటు 125 జీబీ డేటాను పొందవచ్చు. అదనంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా చేసుకునే వీలుంటుంది. రూ. 999 రీఛార్జ్‌తో 90 రోజుల పాటు అన్ని లోకల్‌,ఎస్టీడీ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. 60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అదనంగా ఇస్తారు. ఈ మేర‌కు త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది.

airtel
jio
telecom
market
new offer
pre paid
recharge
data
unlimited
calls
  • Loading...

More Telugu News