kalyan ram: బాబాయ్, తారక్ లకు శుభాకాంక్షలు: కల్యాణ్ రామ్

  • 2014 ఉత్తమ నటుడు బాలయ్య
  • 2016 ఉత్తమ నటుడు ఎన్టీఆర్
  • కుటుంబానికి గర్వించదగ్గ తరుణమన్న కల్యాణ్ రామ్

నందమూరి కుటుంబంలోకి మరో రెండు నంది అవార్డులు వచ్చి చేరాయి. 2014 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. 'లెజెండ్'లో ఆయన నటనకు గాను ఈ అవార్డు వరించింది. 2016 సంవత్సరానికి గాను జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.

ఈ సందర్బంగా నందమూరి కల్యాణ్ రామ్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "2014, 2016 ఉత్తమ నటులుగా ఎంపికైన బాబాయ్, తారక్ లకు శుభాకాంక్షలు. నందమూరి కుటుంబానికి ఇదొక గర్వించదగ్గ తరుణం" అంటూ ట్వీట్ చేశాడు. 

kalyan ram
Balakrishna
junior ntr
nandi awards
  • Error fetching data: Network response was not ok

More Telugu News