rp patnayak: ఉష అప్పుడు ఎందుకు పలకరించలేదో నాకు అర్థం కాలేదు: ఆర్పీ పట్నాయక్
- ఉష చాలా మంచి సింగర్
- తనకి పెళ్లి సంబంధం కూడా నా ద్వారానే కుదిరింది
- ఓ ఫంక్షన్ లో అలా జరిగింది
- కారణమేమిటో నాకు అర్థం కాలేదు
తెలుగు పాటకు పరుగులు నేర్పించిన సంగీత దర్శకులలో ఆర్పీ పట్నాయక్ ఒకరు. ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో .. అంత మంచి సింగర్. అలా ఆయన తాను సంగీత దర్శకుడిగా చేసిన చాలా సినిమాలకి పాటలు పాడారు. ఒకప్పుడు యూత్ ను ఒక ఊపు ఊపేసిన ఆర్పీ పట్నాయక్ .. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
"ఫ్రెష్ వాయిస్ కావాలనే ఉద్దేశంతో మీరు గాయనిగా ఉషను పరిచయం చేశారు. ఆమెకి మీరు గురువు స్థానంలో వున్నారు .. అలాంటిది ఆ తరువాత ఎందుకు గ్యాప్ వచ్చింది?" అనే ప్రశ్న ఆయనకి ఈ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " ఉష చాలా మంచి సింగర్ .. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కూడా నా వల్లనే వచ్చింది. అలాంటిది ఓ ఫంక్షన్ లో నేను ఉండగా .. అక్కడికి వచ్చిన ఆమె, నాకు తప్ప అందరికీ హాయ్ చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు .. తనెందుకు అలా చేసిందో కూడా నాకు తెలియలేదు .. అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది. రీసెంట్ గా ఓ ఫంక్షన్లో కలిసిన ఆమె పలకరించింది. ఇప్పుడు మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు" అంటూ చెప్పుకొచ్చారు.