nandi: కాసేప‌ట్లో నంది అవార్డుల ప్ర‌క‌ట‌న

  • 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డులు
  • జాతీయ అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్న జ్యూరీ స‌భ్యులు
  • చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరుకున్న‌ నంది అవార్డుల నివేదిక  

కాసేప‌ట్లో విజ‌య‌వాడలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డుల‌కు సంబంధించిన నివేదికను జ్యూరీ స‌భ్యులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి అంద‌జేశారు. 2014లో మొత్తం 38 సినిమాలు ఎంట్రీకి రాగా, 2015లో 29, 2016లో 45 సినిమాలు ఎంట్రీకి వ‌చ్చాయి. నంది అవార్డులే కాకుండా ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ స‌భ్యులు ప్ర‌క‌టించ‌నున్నారు.

  • Loading...

More Telugu News