డేరాబాబా: జైల్లో డేరా బాబాకు వీఐపీ ట్రీట్ మెంట్.. గుర్మీత్ మాకెవరికీ కనపడలేదు: బెయిల్ పై బయటకు వచ్చిన ఖైదీ

  • కూలి పనులు చేసే చోటకు కూడా రావడం లేదు
  • నాకే కాదు, ఇతర ఖైదీలకు కూడా కనిపించలేదు
  • గుర్మీత్ వచ్చిన తర్వాత.. మాపై కఠిన నిబంధనలు విధించారు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న మరో ఖైదీ రాహుల్... ఈ రోజు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు అతను సమాధానాలిచ్చాడు.

 జైల్లో గుర్మీత్ సింగ్ ను తానే కాదు.. ఇతర ఖైదీలు కూడా చూడలేదని చెప్పాడు. మిగతా ఖైదీలంతా రోజూ పనులు చేస్తుంటే... గుర్మీత్ అక్కడకు కూడా రావడం లేదని తెలిపాడు. గుర్మీత్ జైలుకు వచ్చిన తర్వాత తమకు కఠిన నిబంధనలు విధించారని, అతనికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారని చెప్పాడు. తమను ఎవరైనా చూడ్డానికి వస్తే కేవలం 20 నిమిషాల పాటే మాట్లాడనిస్తారని... గుర్మీత్ ను కలవడానికి ఎవరైనా వస్తే మాత్రం రెండు గంటలపాటు మాట్లాడనిస్తారని తెలిపాడు.

డేరాబాబా
ram rahim singh
ram rahim singh jail life
rohtak jail
  • Loading...

More Telugu News