vodafone: మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకు వ‌చ్చిన వొడాఫోన్!

  • రూ.458, రూ.509 రీఛార్జ్ ల‌తో రెండు కొత్త‌ ప్లాన్లు
  • ఇరు ప్లాన్ల‌పై అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్, ప్ర‌తిరోజు 1 జీబీ డేటా
  • రూ.458 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు
  • రూ.509 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు

ప్ర‌ముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ మ‌రో ఆఫ‌ర్‌తో త‌మ వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. రూ.458తో రీఛార్జ్ చేయించుకుంటే అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, ప్ర‌తిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 3జీ లేక‌ 4జీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉంటుంది. ఇవే సౌక‌ర్యాల‌తో రూ.509 ప్లాన్ కూడా ప్ర‌క‌టించింది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1 వేయి నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు.

ఇటువంటి ఆఫ‌ర్లే ఇత‌ర టెలికాం కంపెనీలు కూడా అందిస్తోన్న విష‌యం తెలిసిందే. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో అందిస్తోన్న ఆఫ‌ర్ల జోరుతో త‌మ వినియోగ‌దారులు జారి పోకుండా ఉండేందుకు ఇత‌ర టెలికాం కంపెనీలు కూడా అచ్చం అలాంటి ఆఫ‌ర్ల‌నే అందిస్తున్నాయి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News