periodic film: మార్తాండ వర్మ పాత్రలో రానా!

  • ట్రావెంకోర్ రాజు మార్తాండ వ‌ర్మ పాత్ర‌లో క‌నిపించ‌నున్న రానా
  • ఇప్పటికే షూటింగ్ జ‌రుపుకుంటున్న '1945' పీరియాడిక్ సినిమా
  • వ‌రుస‌గా పీరియాడిక్ చిత్రాల‌కు ఓకే చెబుతున్న న‌టుడు

'బాహుబ‌లి' సినిమాల త‌ర్వాత భ‌ల్లాల దేవుడు రానా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయ‌న న‌టించిన 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు మంచి విజ‌యాల‌నే సాధించాయి. 'ఘాజీ' లాంటి పీరియాడిక్ సినిమా త‌ర్వాత '1945' అనే యుద్ధ నేప‌థ్య పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే రానా మ‌రో పీరియాడిక్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

ఈ సినిమాలో ట్రావెంకోర్ మ‌హారాజు మార్తాండ వ‌ర్మ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు రానా ట్వీట్‌లో వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్న ఈ చిత్రానికి కె. మ‌ధు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడ‌ని, రాబిన్ తిరుమ‌ల క‌థ‌ను అందించిన‌ట్లు రానా ట్వీట్‌లో తెలిపాడు.

periodic film
daggubati rana
1945
marthanda varma
tweet
baahubali
  • Loading...

More Telugu News