gangula bhanumathi: మద్దెలచెరువు సూరిని భానుకిరణ్ చంపడానికి అసలు కారణమిదే!: గంగుల భానుమతి

  • రవి కేసు ముగింపు దశకు వచ్చాక హత్య చేశాడు
  • ఆస్తులు పోతాయనే ఆలోచనతోనే హత్య
  • ప్రస్తుతం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాను

ప్రస్తుతం తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నానని మద్దెలచెరువు సూరి భార్య గంగుల భానుమతి తెలిపారు. తన భర్త బతికున్నా, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బతికున్నా తనకు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే... మళ్లీ తనకు మంచి రోజులు వస్తాయని తెలిపారు.

పరిటాల రవి హత్య కేసు ముగింపు దశకు వచ్చిన సమయంలో... సూరిని భానుకిరణ్ హత్య చేశాడని ఆమె అన్నారు. సూరి పేరు మీద ఆస్తులు ఏమీ లేవని, అన్నీ భానుకిరణ్ పేరు మీదే ఉన్నాయని... కేసు పూర్తయిపోతే తన వద్ద ఆస్తులన్నీ సూరికి వెళ్లిపోతాయనే కారణంతో భానుకిరణ్ హత్యకు పాల్పడ్డాడని చెప్పారు.

సూరి చాలా మంచి వ్యక్తి అని, తన వద్ద ఉన్నవారిని నమ్మేవారని, మంచిగా చూసుకునేవారని భానుమతి అన్నారు. భానుకిరణ్ ను కూడా అదేవిధంగా నమ్మారని చెప్పారు. సూరి బయటకు వచ్చినప్పుడు, తాను బెంగళూరులో ఉన్నానని, తనకు ఏ విషయాలు చెప్పేవారు కాదని తెలిపారు. అయితే, తనను వెన్నంటి ఉండేవారని చెప్పారు.

gangula bhanumathi
maddelacheruvu suri
ys rajasekhar reddy
Jagan
bhanu kiran
  • Loading...

More Telugu News