simbu: భర్త మరణం తరువాత సినిమాలకి దూరంగా వున్న జయసుధ .. తాజాగా మణిరత్నం సినిమాకి అంగీకారం

  • ఆ విషాదం తరువాత ఇంటికే పరిమితమైన జయసుధ 
  • తన తాజా చిత్రం కోసం జయసుధను ఒప్పించిన మణిరత్నం 
  • శింబు హీరోగా చేస్తోన్న సినిమాలో ఆమెది కీలక పాత్ర 
  • గతంలో మణిరత్నం దర్శకత్వంలో 'సఖి' మూవీ చేసిన జయసుధ

తెలుగు తెరపై కథానాయికగా ఒక వెలుగు వెలిగిన జయసుధ .. సహజ నటిగా తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె భర్త నితిన్ కపూర్ మరణించారు. ఆయన మరణం మానసికంగా కుంగదీయడంతో, ఆమె ఇన్ని రోజులూ సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి జయసుధ .. తాజాగా మణిరత్నం సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.

 తమిళంలో 'శింబు' కథానాయకుడిగా మణిరత్నం ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్రను జయసుధతో చేయిస్తేనే బాగుంటుందని భావించిన మణిరత్నం, స్వయంగా వచ్చి ఆమెతో ఆ పాత్ర గురించి మాట్లాడారట. దాంతో జయసుధ ఆ పాత్రను చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన 'సఖి' సినిమాలో షాలినికి తల్లి పాత్రలో జయసుధ నటించిన సంగతి తెలిసిందే.      

simbu
jayasudha
  • Loading...

More Telugu News