mars: అంగారక యాత్ర కోసం నమోదు చేసుకున్న వారిలో భారతీయులకు మూడో స్థానం
- మొదటి స్థానంలో అమెరికన్లు
- రెండో స్థానంలో చైనీయులు
- వివరాలు వెల్లడించిన నాసా
మే 5, 2018న అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న అంగారక యాత్ర కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను బయటపెట్టింది. వీరంతా ఇన్‌సైట్ (ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సైస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్) ద్వారా మార్స్ గ్రహం మీదకు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. త్వరలోనే వీరందరికీ ఆన్‌లైన్ ద్వారా బోర్డింగ్ పాసులను జారీ చేయనున్నట్లు నాసా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 24,29,807 మంది ఈ 'మిషన్ టు మార్స్' కోసం నమోదు చేసుకున్నారని నాసా ప్రకటించింది. వీరిలో మొదటిస్థానంలో అమెరికన్లు, రెండో స్థానంలో చైనీయులు, మూడో స్థానంలో భారతీయులు ఉన్నట్లు తెలిపింది. ఈ మిషన్ కోసం నమోదు చేసుకున్న వారిలో భారతీయులు మూడో స్థానంలో ఉండటంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో చేబట్టిన 'మంగళ్‌యాన్' యాత్ర విజయవంతమైనప్పటి నుంచి భారతీయుల్లో అంగారక గ్రహం గురించి అధ్యయనం చేయాలనే ఆసక్తి పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.