chiranjeevi: 'సైరా' రెగ్యులర్ షూటింగ్ తేదీ ఖరారు .. భారీ యాక్షన్ సీన్స్ తో షూటింగ్ మొదలు

  • 'సైరా' రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాలు 
  • డిసెంబర్ 6వ తేదీ నుంచి షూటింగ్ మొదలు 
  • ఫస్టు షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ 
  • నయనతారతో పాటు ప్రియాంక చోప్రా       

చిరంజీవి కథానాయకుడిగా ఆయన 151వ చిత్రంగా 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

 డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా షూటింగును ప్రారంభించనున్నారు. మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేసే పనిలో ఫైట్ మాస్టర్లు నిమగ్నమైనట్టు సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ .. ప్రియాంక చోప్రా .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.       

  • Loading...

More Telugu News