doodle: ప్ర‌త్యేక‌ డూడుల్‌తో 'హోల్ పంచ్‌'కి గుర్తింపునిచ్చిన గూగుల్‌!

  • హోల్ పంచ్‌కి పేటెంట్ వ‌చ్చి 131 ఏళ్లు
  • 1886, న‌వంబ‌ర్ 14న పేటెంట్ తీసుకున్న ఫ్రెడ్రిక్‌
  • ఆక‌ట్టుకుంటున్న డూడుల్‌

రోజువారీ ఆఫీసు ప‌నుల్లో కాగితాల‌కు స‌రిగా రంధ్రాలు చేయ‌డానికి ఉప‌యోగించే హోల్ పంచ్‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ అలా వ‌దిలేయలేదు. హోల్ పంచ్ పేటెంట్ తీసుకుని 131 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా డూడుల్ రూపంలో దాన్ని గుర్తుచేసుకుంది. ఏళ్లు గ‌డిచిన హోల్ పంచ్ రూపం, దాని అవ‌స‌రం ఏ మాత్రం మార‌లేదు. చిన్న స్థాయి గుమాస్తా ఆఫీసు నుంచి పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల్లోనూ దాని అవ‌స‌రం ఉంటుంది. ఆ అవ‌స‌రాన్ని గుర్తు చేస్తూ గూగుల్ ఓ యానిమేటెడ్ డూడుల్‌ను హోం పేజీలో ఉంచింది. ఈ డూడుల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

జ‌ర్మ‌న్‌కి చెందిన ఫ్రెడ్రిక్ సోయ్‌నెక్క‌న్ 1886, న‌వంబ‌ర్ 14న హోల్ పంచ్‌కి పేటెంట్ తీసుకున్నారు. హోల్ పంచ్‌తో పాటు కాపీ బైండ‌ర్‌ను, క్యాలీగ్ర‌ఫీ కోసం ఉప‌యోగించే ప్ర‌త్యేక సిరాను కూడా సోయ్‌నెక్క‌న్ త‌యారుచేశారు. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా సింగిల్ హోల్ పంచ్‌ను ఉప‌యోగిస్తున్నారు. పెద్ద సంఖ్య‌లో పేప‌ర్ల‌కు రంధ్రాలు చేయ‌డానికి భారీ హోల్ పంచ్‌లు కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News