Krishna River: కృష్ణా నదిలో బోటు ప్రమాదం ఘటనలో తొలి వేటు!

  • పర్యాటకశాఖ డ్రైవర్ గేదెల శ్రీనును తొలిగించిన ప్రభుత్వం
  • నేడు సచివాలయంలో బోటు నిర్వాహకులతో సమావేశం
  • 22కు చేరిన మృతుల సంఖ్య

కృష్ణానదిలో బోటు ప్రమాద ఘటనలో తొలి వేటు పడింది. పర్యాటకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గేదెల శ్రీనును ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి బాధ్యులైన ఇతరులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పడవ ప్రమాద ఘటనలో పర్యాటకశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన గేదెల శ్రీను ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రాష్ట్రంలోని బోటు ఆపరేటర్లతో నేడు సమావేశం నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా తెలిపారు.

కాగా, పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 22కు చేరింది. ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్  సభ్యులు ఆదివారం ఒంగోలు నుంచి మొత్తం 60 మంది రెండు వాహనాల్లో బయలుదేరారు. అమరావతిలోని అమరలింగేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి పవిత్ర సంగమం వద్ద హారతి చూసేందుకు వెళ్తూ పలువురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Krishna River
Andhra Pradesh
Boat
  • Loading...

More Telugu News