charan: 'రంగస్థలం' కోసం పారితోషికం తగ్గించుకున్న చరణ్!

  • విలేజ్ సెట్ కోసం భారీ ఖర్చు 
  • నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకున్న చరణ్
  • కీలకపాత్రల్లో జగపతి .. ఆది పినిశెట్టి .. అనసూయ       

సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారు. ప్రస్తుతం విలేజ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. గోదావరి తీరప్రాంతంలో గల పల్లె సెట్ కోసం భారీస్థాయిలో ఖర్చు చేశారు. ఈ సినిమా కోసం అవుతోన్న ఖర్చును చూసిన చరణ్ .. తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా సమాచారం.

'ఖైదీ నెంబర్ 150' సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన చరణ్ కి, నిర్మాతల సాధక బాధకాలు తెలుసు. అందువల్లనే ఆయన 'రంగస్థలం' సినిమాకి అవుతోన్న ఖర్చును దృష్టిలో పెట్టుకుని, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతిబాబు .. ఆది పినిశెట్టి .. అనసూయ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.       

charan
samanta
  • Loading...

More Telugu News