Pawan Kalyan: బోటు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి.. ప్రభుత్వానికి తనదైన శైలిలో సూచన

  • మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నా
  • జరిగిన నష్టం పూడ్చలేనిది
  • ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న తాను మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నానని ఫేస్ బుక్ ద్వారా ఆయన తెలిపారు. చిన్నచిన్న నిర్లక్ష్యాలకు ఎంతో విలువైన ఇన్ని ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'... లాంటి మాటలను చెప్పడం ద్వారా మృతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అన్నారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసిందని పవన్ తెలిపారు. ఇంకోసారి ఇలాంటి సానుభూతి ప్రకటన చేయాల్సిన పరిస్థితి, అవసరం రాకుండా ఉండే పరిస్థితులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

Pawan Kalyan
janasena
vijayawada boat accident
pawan on boat accident
  • Error fetching data: Network response was not ok

More Telugu News