sunil: 'బాహుబలి' రచయితతో సునీల్ సినిమా ఖరారు!

  • సునీల్ తాజా చిత్రంగా 'టూ కంట్రీస్' 
  • ఆయనకి కథ వినిపించిన విజయేంద్ర ప్రసాద్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సునీల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి  

సునీల్ మంచి నటుడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తాజా చిత్రంగా 'టూ కంట్రీస్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన ఒక వైపున హీరోగా కొనసాగుతూనే, మరో వైపున స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో హీరోగా సునీల్ మరో సినిమాను అంగీకరించాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు.

 ఈ సినిమాకి రాజమౌళి తండ్రి .. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. బలమైన .. వైవిధ్యభరితమైన కథా కథనాలను తెరపై ఆవిష్కరించే ఆయన, గతంలో 'రాజన్న' .. 'శ్రీవల్లి' సినిమాలను తెరకెక్కించారు. విజయేంద్ర ప్రసాద్ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాననీ . త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామని సునీల్ చెప్పాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.  

  • Loading...

More Telugu News